ఇటు 'విరాటపాలెం'.. అటు 'కానిస్టేబుల్ కనకం' .. ఎక్కడో ఏదో జరిగింది!
- 'విరాటపాలెం' సిరీస్ ను ప్రకటించిన జీ 5
- ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- ఈ సిరీస్ రిలీజ్ ఆపాలంటూ కోర్టుకి వెళ్లిన ఈటీవీ విన్
1980లలో .. ఒక మారుమూల గ్రామంలో నడిచే కథ ఇది. ఆ గ్రామంలో పెళ్లి చేసుకోవాలనుకున్న యువతులు, పెళ్లికూతురుగా ఉండగానే అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ అర్థం కాదు. తమ గ్రామానికి అదొక శాపం కావొచ్చని నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక లేడీ కానిస్టేబుల్ వస్తుంది. ఆమె రాకతో ఏం జరుగుతుందనేది కథ.
అయితే ఇప్పుడు ఈ సిరీస్ రిలీజ్ ను నిలిపివేయాలని కోరుతూ, ఈటీవీ విన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ ఫ్లాట్ ఫామ్ పై త్వరలో విడుదల కానున్న 'కానిస్టేబుల్ కనకం' కథతోనే 'విరాటపాలెం' సిద్ధమైందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 'కానిస్టేబుల్ కనకం'గా వర్ష బొల్లమ్మ నటించిన ఈ సిరీస్ కి, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. మరి ఒకే కథతో రూపొందిన ఈ రెండు సిరీస్ ల విషయం ఎటువైపు వెళుతుందో చూడాలి.