బస్టాప్ లో మహిళలపైకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో ఇదిగో!
--
బస్టాప్ ముందు నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. బస్సు మీదికి వస్తుండడంతో తప్పించుకునేందుకు ఆ మహిళలు విఫలయత్నం చేశారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.