కేటీఆర్ అంటే ఒక మహాశక్తి: హరీశ్ రావు
- కేటీఆర్ పై రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్న హరీశ్
- ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ తలవంచరని వ్యాఖ్య
- తెలంగాణ మొత్తం కేటీఆర్ వెనుక ఉందన్న హరీశ్
కక్షసాధింపుల్లో భాగంగానే కేటీఆర్ పై తప్పుడు కేసులు మోపి, విచారణ పేరుతో తిప్పుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ పాలనలో తాము దగ్గినా, తుమ్మినా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టినా తలవంచే వ్యక్తి కేటీఆర్ కాదని... తెలంగాణ మొత్తం తన వెనుక నిలబడ్డ మహాశక్తి అని అన్నారు. కేటీఆర్ కు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అండగా ఉన్నారని... కేటీఆర్ ను ముట్టుకున్నవారు భస్మమవుతారని హెచ్చరించారు.