మలేషియాలో పాకిస్థాన్‌కు షాక్.. భారత కార్యక్రమాల రద్దు వినతి తిరస్కరణ
- మలేషియాలో భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం
- సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం కార్యక్రమాలు రద్దు చేయాలని వినతి
- మతపరమైన కారణాలు చూపుతూ మలేషియాపై పాక్ ఒత్తిడి
- పాకిస్థాన్ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన మలేషియా
- ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన మలేషియా
అయితే, పాకిస్థాన్ చేసిన ఈ అభ్యర్థనను మలేషియా ప్రభుత్వం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ వినతిని మలేషియా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ చేస్తున్న భారత్ వ్యతిరేక ప్రచారానికి ఒక ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.