డిప్యూటీ సీఎం పవన్‌ను తిరంగా ర్యాలీకి రావాలని పురందేశ్వరి పిలుపు
- ఆపరేషన్ సిందూర్, భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీ
- విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించాలని పురందేశ్వరి నిర్ణయం
- తిరంగా ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలకు పురందేశ్వరి ఆహ్వానం
- డిప్యూటీ సీఎం పవన్‌కు ఫోన్ ద్వారా ర్యాలీలో పాల్గొనాలని పిలుపు
ఈ క్రమంలో తిరంగా ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలను పురందేశ్వరి ఆహ్వానించారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆమె ఫోన్ చేసి, ర్యాలీలో పాల్గొనాలని కోరారు. దీంతో పురందేశ్వరి పిలుపు మేరకు జనసేనాని ఈ ర్యాలీలో పాల్గొంటానని చెప్పారు. ఇక, ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారని పురందేశ్వరి వెల్లడించారు.