కాంతార నటుడి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హీరో రిషబ్ శెట్టి
- గుండె పోటుతో కాంతార నటుడు రాకేశ్ పూజారి మృతి
- రాకేశ్ మృతి పట్ల భావోద్వేగ పోస్టు పెట్టిన కాంతార హీరో రిషబ్ శెట్టి
- రాకేశ్ లేని లోటు మరొకరు తీర్చలేరన్న రిషబ్
రాకేశ్ మృతి పట్ల కాంతార 2 హీరో రిషబ్ శెట్టి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
"మిత్రమా.. మళ్లీ జన్మించు" అంటూ నటుడు రిషబ్ శెట్టి భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. కాంతారలో నీ పాత్ర, ఆ పాత్రలో నటించే క్రమంలో నీ ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. నీ లోటు ఎవరూ తీర్చలేనిది" అంటూ రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ ద్వారా రాకేశ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.