ఆపరేషన్ సిందూర్: 27 విమానాశ్రయాలు క్లోజ్
- ఈ నెల 10వ తేదీ వరకు పలు విమానాలు కూడా రద్దు
- సరిహద్దు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించిన కేంద్రం
- ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ క్రమంలో ప్రయాణికుల విమానాలను, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే ముప్పు ఉందని కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అక్కడి ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాలతో పాటు విమానాశ్రయాలు, విద్యాసంస్థలను మూసివేశాయి.