భారత భద్రతా బలగాల అదుపులో పాకిస్థాన్ రేంజర్!
- రాజస్థాన్ లో భారత్ – పాకిస్థాన్ సరిహద్దు వద్ద భారత జవాన్లపై దుర్భాషలాడిన పాక్ జవాన్
- పాక్ జవానును అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
- పది రోజులకుపైగా పాక్ చెరలోనే ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం సాహు
పాక్ సైనికుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలియడంతో పాకిస్థాన్ సైనికుల్లో అలజడి నెలకొంది. సరిహద్దు గార్డుల ఫ్లాగ్ మీటింగ్ జరపాలని పట్టుబట్టింది. పాక్ సైనికుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే బీఎస్ఎఫ్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
మరోపక్క పది రోజులకు పైగా భారత జవాను పూర్ణం సాహు పాక్ అదుపులో ఉన్నాడు. పది రోజుల క్రితం పొరబాటున పొరుగు దేశం సరిహద్దులోకి ప్రవేశించినందుకు భారత జవాను పూర్ణం సాహును పాకిస్థాన్ సైనికులు అరెస్టు చేశారు. ఫ్లాగ్ మీటింగ్ జరిగినప్పటికీ పాకిస్థాన్ అతన్ని విడుదల చేయలేదు. దీంతో ఆ సైనికుడి కుటుంబం ఆందోళన చెందుతోంది.
భారత ప్రభుత్వం పాకిస్థాన్ చెరలో ఉన్న బీఎస్ఎఫ్ జవానును విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కలేదు. పది రోజులకు పైగా అతను వారి అదుపులోనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఒక పాకిస్థాన్ జవానును బీఎస్ఎఫ్ అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామంతో భారత జవానును పాక్ చెర నుంచి విడిపించుకోవడానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.