పాక్ తో యుద్ధం వద్దన్న సిద్ధరామయ్య... యెడియూరప్ప ఫైర్
- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
- సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటన్న యెడియూరప్ప
- సిద్ధరామయ్య దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కూడా ఘాటుగా స్పందించారు. మైనారిటీల కోసమే సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో, సిద్ధరామయ్య వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమని, క్షమించరానివని అన్నారు. భారతదేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, కానీ దేశాన్ని రక్షించుకోవాల్సి వస్తే వెనకాడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని విజయేంద్ర పునరుద్ఘాటించారు.