ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

All Party Meet in Delhi on Pahalgham Attack
పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, నేడు దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ కీలక సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా, జై శంకర్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో... పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తీరుతెన్నులు, కేంద్రం తీసుకున్న చర్యలను రాజ్ నాథ్ సింగ్ వివరించనున్నారు. ఉగ్రదాడులను ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో సలహాలను కోరనున్నారు.
Go Back to Shorts
Rajnath Singh
All-Party Meeting
Delhi
Pahalgham Terrorist Attack
India-Pakistan
Amit Shah
Rahul Gandhi
Mallikarjun Kharge
National Security
Terrorism

More Telugu News