మరోసారి కంట్రోల్ తప్పిన అజిత్ కారు... వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి కంట్రోల్ తప్పిన అజిత్ కారు... వీడియో ఇదిగో!

Ajiths Car Loses Control Again Watch the Video
 
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాంచి రేసర్ అని తెలిసిందే. ఆయన రేసింగ్ టీమ్ ఇటీవలే యూఏఈలో పోడియం ఫినిష్ చేసింది. అయితే, రేసింగ్ ట్రాక్ పై అజిత్ కారు పలుమార్లు అదుపు తప్పడం తెలిసిందే. ఓసారి పల్టీలు కొట్టింది. తాజాగా ఆయన కారు మరోసారి కంట్రోల్ తప్పింది. 

బెల్జియంలో జరుగుతున్న రేసింగ్ ఈవెంట్ లో అజిత్ నడుపుతున్న కారు ట్రాక్ పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. సర్క్యూట్ డి ఫ్రాంకోర్ చాంప్స్ రేసులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు తగల్లేదు. దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
Advertisement
Ajith
Ajith Kumar
racing accident
Belgium racing event
Circuit de Francorchamps
car crash
Ajith car crash video
Kollywood actor
racing incident
UAE racing

More Telugu News