రూ. 2 వేల కోట్లను దోచుకునేందుకు సోనియా ప్రయత్నించారు: బండి సంజయ్
- నేషనల్ హెరాల్డ్ ద్వారా దేశ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమయిందన్న సంజయ్
- నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదన్న కేంద్ర మంత్రి
- యూపీఏ హయాంలోనే సీబీఐ దర్యాప్తు మొదలయిందని వెల్లడి
ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని... 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు మొదలయిందని చెప్పారు. ఆ సమయంలోనే సోనియా, రాహుల్ బెయిల్ పొందారని తెలిపారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. తప్పు చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని చెప్పారు.