సలేశ్వరం జాతరలో తొక్కిసలాట
లోయలో, చెప్పుల కురవ ప్రాంతానికి దిగువనగల ఇరుకు దారి చివర్లో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు గాయపడ్డారు. పదేళ్ల చిన్నారి ఊపిరి ఆడక అస్వస్థతకు గురైంది. ఓ భక్తుడిపై పైనుంచి బండరాయి పడటంతో తలకు గాయమైంది.