2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ. 2,243 కోట్ల విరాళాలు: ఏడీఆర్
- అన్ని పార్టీలకు వచ్చిన విరాళాలు రూ. 2,544 కోట్లు
- ఒక్క బీజేపీకే 88 శాతం విరాళాలు
- రూ. 281 కోట్లతో రెండో స్థానంలో కాంగ్రెస్
అన్ని జాతీయ పార్టీలకు కలిపి మొత్తం రూ. 2,544.28 కోట్ల విరాళాలు అందాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 12,547 కోట్లుగా నమోదైంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాలలో బీజేపీ వాటా 88 శాతంగా ఉంది. రూ. 281 కోట్ల విరాళాలతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నాయి. తమకు ఎలాంటి విరాళాలు అందలేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రకటించింది.