అమానుషం... చెట్టుకు క‌ట్టేసి ప్రైవేట్ పార్ట్స్‌లో ఎర్ర చీమ‌ల‌ను వ‌దిలి రాక్ష‌సానందం..!

Horrific Child Abuse in Karnataka Boy Tied to Tree Ants Placed on Private Parts
  • కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఘ‌ట‌న‌
  • దొంగ‌త‌నం నెపంతో బాలుడిపై సొంత‌ వర్గానికి చెందినవారే దాష్టీకం
  • బ‌ట్ట‌లు విప్పి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన వైనం
  • ఇందుకు సంబంధించిన‌ వీడియో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో వెలుగులోకి ఘ‌ట‌న‌
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో అమానుష ఘ‌ట‌న చోటుచేసుకుంది. దొంగ‌త‌నం నెపంతో ఓ బాలుడిని అతని సొంత‌ వర్గానికి చెందినవారే దారుణంగా హింసించారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైరల్‌గా మారింది.

చన్నగిరి తాలూకా నల్లూరు సమీపంలోని అస్తపనహళ్లి గ్రామానికి చెందిన హక్కీ-పిక్కీ గిరిజన వర్గానికి చెందిన బాలుడిని దొంగ‌త‌నం చేశాడ‌నే అనుమానంతో బ‌ట్ట‌లు విప్పి అరెకా చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా అత‌ని ప్రైవేట్ పార్ట్స్ వ‌ద్ద‌ ఎర్ర చీమ‌ల‌ను వ‌దిలి రాక్ష‌సానందం పొందారు. కొద్దిరోజుల కింద‌ట ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా, తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వ‌చ్చింది. 

దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ చన్నగిరి పోలీసులను అస్తపనహళ్లి గ్రామాన్ని సందర్శించి, పూర్తి వివరాలను సేకరించి, సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆమె వెల్ల‌డించారు.
Go Back to Shorts
Karnataka
Tribal Boy Tortured
Karnataka Child Abuse
Davangere District
Brutal Assault
Child Cruelty
Viral Video
Police Investigation
Uma Prashant
Astapahanalli Village
Hakki-Pikki Tribe

More Telugu News