కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలన్న కేంద్రం
- అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం
- వాస్తవ నివేదిక వివరాలను, తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలన్న కేంద్రం
కంచ గచ్చిబౌలి భూములపై వాస్తవ నివేదికను పంపాల్సిందిగా తెలంగాణ అటవీ శాఖను తాజాగా కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.
ఈ నేపథ్యంలో న్యాయస్థానాల తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని, అటవీ చట్టాలకు లోబడి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ భూమికి సంబంధించిన వాస్తవ నివేదిక వివరాలను, తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని కేంద్రం పేర్కొంది.