నటనలో విభిన్న శైలి, పెద్దల పట్ల గౌరవం... రామ్ చరణ్ ఎదుగుదలకు దోహదం చేస్తాయి: పవన్ కల్యాణ్
- నేడు రామ్ చరణ్ పుట్టినరోజు
- గ్లోబల్ స్టార్ పై విషెస్ వెల్లువ
- ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
"వెండితెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచి ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే, ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకుంటున్నారు.
మరోవైపు, రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియజేస్తున్నాయి. నటనలో విభిన్న శైలిని ప్రదర్శించడం, పెద్దల పట్ల గౌరవం, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత... రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.