భారత్ - అమెరికా మధ్య ప్రారంభమైన వాణిజ్య ఒప్పంద చర్చలు .. అమెరికా కీలక ప్రకటన
- ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాల ప్రకటన
- చైనా, కెనడా, మెక్సికోలతో భారత్‌ను పోల్చమన్న అమెరికా
- ప్రారంభమైన వాణిజ్య ఒప్పంద చర్చలు
భారత్ – యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో భారత అధికారులతో ఆ బృందం చర్చలు ప్రారంభించింది. ఇరుదేశాలు వాణిజ్యంపై శుక్రవారం నాటికి ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. రెండు దేశాల ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని భావిస్తున్నామని చర్చల్లో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు.
కాగా, ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్‌లో వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు అని మరో అధికారి తెలిపారు. ఈ పర్యటనలో వాణిజ్యం, సుంకాలు వంటి అంశాలతో పాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.