కార్యక్రమాలు రద్దు చేసుకుని అకస్మాత్తుగా ఢిల్లీకి కిషన్‌రెడ్డి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, నేటి పార్లమెంటు సమావేశాల్లో మొదటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉండటంతోనే కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.