ఐపీఎల్ ప్రారంభానికి ముందు వినియోదారులకు జియో తీపి కబురు
- మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియం లీగ్ ప్రారంభం
- యూజర్లు రూ. 299 అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
- 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని వెల్లడి
- ఇంతకుముందు మ్యాచ్‌లను వీక్షించాలంటే వినియోగదారులు కనీస సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనే షరతు
ఈ నేపథ్యంలో తాజాగా తన వినియోగదారులకు జియో తీపి కబురు చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై జియో యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని వెల్లడించింది. వినియోగదారులు రూ. 299 అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు. దీంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.