భలేదొంగలు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో!
ఏక కాలంలో ఇలా నాలుగు అపార్ట్‌మెంట్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఉదయం బయటకు వచ్చి చూసిన అపార్ట్‌మెంట్ వాసులకు తమ చెప్పులు, బూట్లు కనిపించకపోవడంతో కంగుతిన్నారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి షాకయ్యారు. కొస మెరుపు ఏంటంటే బాధితుల్లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్, ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉండటం. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.