చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసుల నోటీసులు

Police notices to Chevireddy Bhaskar Reddy
  • ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులు
  • యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా
  • ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నోటీసులు అందించిన పోలీసులు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి చెవిరెడ్డి పోటీ చేశారు. 

ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, పెద్దారవీడు, దోర్నాలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. ఈ కేసుల్లో యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా ఉంది.
Go Back to Shorts
Chevireddy Bhaskar Reddy
YSRCP

More Telugu News