ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు: సోము వీర్రాజు
- ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజుకు చాన్స్
- ప్రజల సంక్షేమం కోసం, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్న వీర్రాజు
- రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి పాటుపడతామని వెల్లడి
"ఏపీ శాసనమండలి ఎన్నికల కోసం నామినేషన్ వేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం, పార్టీ ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేసేందుకు కట్టుబడి ఉంటాను. పార్టీ కేంద్ర నాయకత్వం మార్గదర్శనంలో ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషిని కొనసాగిస్తాం" అని సోము వీర్రాజు వెల్లడించారు.