కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు సమావేశం... పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
- ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
- వరుస సమావేశాలో ఫుల్ బిజీ
- తాజాగా గడ్కరీని కలిసి ఏపీకి రావాల్సిన నిధులపై చర్చ
చంద్రబాబుతో సమావేశంపై నితిన్ గడ్కరీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష చేపట్టామని వెల్లడించారు.
ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారని గడ్కరీ వెల్లడించారు.
