రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
- ప్రమాద సమయంలో పడవలో 12 మంది
- సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న 10 మంది
- అనంతపురం జిల్లాలో బొలెరో బోల్తా పడి యువతి మృతి
అనంతపురంలో బొలెరో బోల్తా
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఊడెగోళం సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి (18) ప్రాణాలు కోల్పోయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బొలెరో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 35 మంది ఉన్నారు. వెనుక కూర్చున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు శ్రీక్యాతలింగేశ్వర, బొమ్మాలింగేశ్వర జాతరకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.