అలాగైతే జగన్ జర్మనీ వెళితే బాగుంటుంది: పవన్ కల్యాణ్
- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ జగన్, వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్
- మీడియా పాయింట్ వద్ద సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్
జర్మనీలో ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా చట్టసభల సీట్లు కేటాయిస్తుంటారని, ఒకవేళ ఒక పార్టీకి 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే... ఆ ఓట్లను ఇతరులు పంచుకుంటారని పవన్ వివరించారు. జగన్ ఇంకా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పడితే జర్మనీ వెళితే సరి అని పవన్ వ్యాఖ్యానించారు.