హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఖరీదైన కార్లతో స్టంట్... అరెస్ట్ చేసిన పోలీసులు
- టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ కార్లతో రింగ్ రోడ్డుపై స్టంట్
- నిందితుల అరెస్ట్
- లగ్జరీ కార్లను సీజ్ చేసిన పోలీసులు
ఫిబ్రవరి 9వ తేదీన ఔటర్ రింగు రోడ్డులోని ఐదు వరుసల రహదారిపై టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ కార్లతో విన్యాసాలు చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ రికార్డు అయింది. ఆ కార్లను ఒకేచోట సర్కిల్‌గా తిప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఈ విన్యాసాలపై రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని ఈ రోజు అరెస్ట్ చేశారు.