మోదీజీ, మమ్మల్ని ఓడించడం మీకీజన్మలో అసాధ్యం.. కేజ్రీవాల్ పాత వీడియో వైరల్
--
కొంతమంది నెటిజన్లు ఈ వీడియోకు మీమ్స్ జత చేసి పోస్ట్ చేయడంతో అవి కూడా వైరల్ గా మారాయి. కేజ్రీవాల్ మాట్లాడిన మాటల తర్వాత వీడియోకు మీమ్స్ జతచేశారు. కేజ్రీవాల్ ను రాహుల్ గాంధీ ఆపుతున్నట్లు, మాట్లాడొద్దు, సైలెన్స్ గా ఉండు అన్నట్లు మీమ్స్ యాడ్ చేశారు. ఆప్ ను ఓడించడానికి వచ్చే జన్మ వరకు ఎందుకు ఇప్పుడే ఓడించామంటూ బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో సీఎం అతిశీ మినహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు.