చంద్రబాబు ప్రచారం చేసిన ఢిల్లీలోని షహాదరాలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ విజయం

BJP Wins In Delhi Shahdara After 32 Years
ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రచారం చేసిన ఢిల్లీలోని షహదరాలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ జయకేతనం ఎగురవేసింది. 1993లో తొలిసారి, చివరిసారి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్‌నివాస్ గోయల్ గెలుపొందారు. ఆ తర్వాత 1998, 2003, 2008 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ విజయం సాధించింది. 2013లో శిరోమణి అకాలీదళ్, 2015, 2020 ఎన్నికల్లో ‘ఆప్’ విజయం సాధించాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 2న షహదరా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్‌కు మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో గోయల్ 5 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 32 సంవత్సరాల తర్వాత అక్కడ బీజేపీ విజయం సాధించడంతో కమలం పార్టీ సంబరాల్లో మునిగిపోయింది.
Go Back to Shorts
Chandrababu
BJP
Delhi Elections
Shahdara

More Telugu News