అయోధ్య జిల్లా మిల్కీపూర్‌లో బీజేపీ గెలుపు... యూపీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
- సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాస్వాన్ గెలుపు
- 60 వేల పైచిలుకు మెజార్టీతో విజయం
- 2027 ఎన్నికలకు ఇది ట్రైలర్ అన్న ఉప ముఖ్యమంత్రి
మిల్కీపూర్ విజయంపై ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ విజయం కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. మొత్తం చిత్రం 2027లో వెల్లడవుతుందన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీ జీరో అవుతుందని జోస్యం చెప్పారు.