చంద్రబాబును కలిసిన సినీ సంగీత దర్శకుడు థమన్.. అభినందించిన సీఎం
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
- తలసేమియా బాధితుల సహాయార్థం థమన్ మ్యూజికల్ నైట్
- థమన్ ను అభినందించిన చంద్రబాబు
తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో థమన్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. ఫండ్ రైజింగ్ కోసం నిర్వహిస్తున్న ఈ మ్యూజికల్ నైట్ కోసం తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి సేవా థృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును థమన్ కలిశారు. థమన్ చేస్తున్న మంచి పనికి ఆయనను చంద్రబాబు అభినందించారు.
