కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ
- ఇటీవల కన్నుమూసిన కేసీఆర్ సోదరి సకలమ్మ
- కేసీఆర్ కు సంతాప సందేశాన్ని పంపిన మోదీ
- ఆమె మరణ వార్తతో దిగ్భ్రాంతి చెందానన్న ప్రధాని
ఆమె మానవతా విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. కుటుంబ సభ్యులకు ఆమె అందించిన విలువలు, మార్గదర్శనం ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. ఆమెతో గడిపిన మధుర జ్ఞాపకాలు ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, మనోబలాన్ని ఇస్తాయని అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్నానని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని అన్నారు. ఈ విషాద క్షణాలను అధిగమించే శక్తి, సహనాన్ని కుటుంబసభ్యులు పొందాలని లేఖలో పేర్కొన్నారు.