జ‌గిత్యాల‌ రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై దుర్మ‌ర‌ణం!

Female SI Dies in Jagtial Road Accident
  • రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై కొక్కుల‌ శ్వేత మృతి  
  • ఎదురుగా వ‌చ్చిన బైక్‌ను త‌ప్పించ‌బోయి ఓ చెట్టును ఢీకొట్టిన ఎస్సై కారు
  • గొల్ల‌ప‌ల్లి నుంచి జగిత్యాల వైపు వెళుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం
  •  ప్ర‌స్తుతం జ‌గిత్యాల పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్ లో ప‌నిచేస్తున్న శ్వేత‌
జ‌గిత్యాల‌లో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. చిల్వ‌కోడూరు వద్ద ఎదురుగా వ‌చ్చిన‌ ద్విచ‌క్ర‌ వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి కారు ఓ చెట్టును ఢీకొన‌డంతో అందులో ప్ర‌యాణిస్తున్న‌ మ‌హిళా ఎస్సై కొక్కుల‌ శ్వేత చనిపోయారు. గొల్ల‌ప‌ల్లి నుంచి జగిత్యాల వైపు వెళుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బైక్‌పై వెళుతున్న వ్య‌క్తి కూడా మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. దాంతో ఇద్ద‌రి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం జ‌గిత్యాల ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా, శ్వేత ప్ర‌స్తుతం జ‌గిత్యాల పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్‌లో ప‌నిచేస్తున్నారు. 


Go Back to Shorts
Jagtial District
Telangana
Road Accident

More Telugu News