సైఫ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చిన తల్లి షర్మిలా ఠాగూర్
- గత రాత్రి తన నివాసంలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్
- ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స
- ఘటన పట్ల దిగ్భ్రాంతికి గురైన సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్
కాగా, సైఫ్ తల్లి, అలనాటి నటి షర్మిలా ఠాగూర్ ఈ సాయంత్రం లీలావతి ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న కుమారుడ్ని పరామర్శించారు. కత్తిపోట్ల ఘటన పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిలా ఠాగూర్ రాకకు ముందే సైఫ్ ను పలువురు బాలీవుడ్ తారలు పరామర్శించారు. సంజయ్ దత్, మలైకా అరోరా, రణబీర్ కపూర్, అలియా భట్ తదితరులు పరామర్శించారు.