'క‌న్న‌ప్ప‌'లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'క‌న్న‌ప్ప‌'లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Here is the glorious full look of Kajal Aggarwal as Parvati Devi in Kannappa
  • ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో 'క‌న్న‌ప్ప' 
  • పార్వ‌తీ దేవిగా క‌నిపించ‌నున్న కాజ‌ల్ అగ‌ర్వాల్
  • తాజాగా ఆమె తాలూకు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌
మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న 'క‌న్న‌ప్ప' చిత్రం నుంచి మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది. ఇందులో హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ పార్వ‌తీ దేవిగా క‌నిపించ‌నున్న‌ట్టు చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఆమె పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 

"ముల్లోకాలు ఏలే త‌ల్లి! భ‌క్తుల‌ను ఆదుకునే త్రిశ‌క్తి! శ్రీకాళ‌హ‌స్తిలో వెల‌సిన శ్రీజ్ఞాన ప్ర‌సూనాంబిక! పార్వ‌తి దేవి" అంటూ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను మేక‌ర్స్ పంచుకున్నారు. ఆమె అత్యద్భుతమైన అందం, దైవిక ఉనికికి సాక్ష్యమివ్వండి. ఆమె భక్తి మరియు త్యాగం ఈ పురాణ గాథలో జీవం పోసింది అని చిత్రం యూనిట్ పేర్కొంది. 

కాగా, ఈ చిత్రంలో ప్ర‌భాస్‌, మోహ‌న్ బాబు, అక్ష‌య్ కుమార్, మోహ‌న్ లాల్ వంటి స్టార్ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూవీలోని ప‌లు కీల‌క పాత్ర‌ల తాలూకు పోస్ట‌ర్ల‌ను చిత్రం యూనిట్ విడుద‌ల చేసింది. ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న విడుద‌ల కానుంది.
Advertisement
Kannappa
Kajal Aggarwal

More Telugu News