తెలంగాణలో మరో కాలేజీలో అమ్మాయిల వాష్‌రూంలో వీడియో రికార్డింగ్ కలకలం

Videos recording in girls wash room in Palamuru
  • మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన
  • మొబైల్‌తో వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు
  • విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణలో మరో కాలేజీలో అమ్మాయిల వాష్ రూంలో వీడియో కలకలం చెలరేగింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో బాత్రూంలో వీడియోల చిత్రీకరణ సంచలనం రేపింది. తాజాగా, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కెమెరా కలకలం సృష్టించింది. ఈ కాలేజీలోని గర్ల్స్ టాయిలెట్‌లో మొబైల్ కెమెరాను పెట్టారు.

తమ వాష్‌రూంలో మొబైల్‌తో వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు నేడు కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళనకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.

విషయం తెలియడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. వీడియో తీసిన వ్యక్తిని అదే కాలేజీలో చదువుతున్న థర్డ్ ఇయర్ విద్యార్థి సిద్దార్థ్‌గా గుర్తించారు. 

బ్యాక్ లాగ్ రాసేందుకు వచ్చిన సమయంలో వాష్‌రూంలో మొబైల్ కెమెరా పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు వీడియోను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల స్టేట్‌మెంట్ రికార్డ్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.
Go Back to Shorts
Telangana
College
Viral Videos

More Telugu News