సిడ్నీ టెస్టు.. సేమ్ సీన్ రిపీట్.. టీమిండియా 185 రన్స్‌కే ఆలౌట్
- సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ ఐదో టెస్టు
- మరోసారి తడపడ్డ భారత బ్యాటర్లు
- 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన పంత్
- 4 వికెట్లు పడగొట్టిన స్కాట్ బొలాండ్
కేఎల్ రాహుల్ (04), యశస్వి జైస్వాల్ (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. విరాట్ కోహ్లీ (17), నితీశ్ కుమార్ రెడ్డి (0) మరోసారి నిరాశ పరిచారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ 4 వికెట్లు పడగొట్టగా... మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశారు.