రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు
- విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసుల పిలుపు
- ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ పేట పోలీస్ స్టేషన్కు రావాలని సూచన
- బియ్యం మాయం కేసులో నిందితురాలిగా ఉన్న జయసుధ
జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ ఏ-1గా ఉన్నారు. అయితే, ఈ కేసులో జయసుధకు కోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. పోలీసు విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.