‘కింగ్ ఈజ్ డెడ్’.. కోహ్లీ దారుణ ఫామ్‌పై ఆర్సీబీ మాజీ కోచ్
- పెర్త్‌లో సెంచరీ తర్వాత వరుసగా విఫలమవుతున్న కోహ్లీ
- ‘కింగ్’ ఇప్పుడు బుమ్రా వశమైందన్న సైమన్ కటిచ్
- ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 30 వికెట్లు పడగొట్టిన పేసర్
కోహ్లీ ఫామ్‌పై కటిచ్ మాట్లాడుతూ.. ‘ది కింగ్ ఈజ్ డెడ్’ అని విమర్శించాడు. అతడు తబడుతున్నాడని, ‘కింగ్’ను ఇప్పుడు బుమ్రా తీసేసుకున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నాడని, అది అతడికి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపాడు. ఈ సిరీస్‌లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 12.83 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 44 టెస్టులు ఆడి 203 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిది, సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది.