నితీశ్ కుమార్ రెడ్డికి సునీల్ గవాస్కర్ కీలక సూచన!
- నితీశ్ కుమార్ రెడ్డి మరిన్ని సెంచరీలు చేయబోతున్నాడని జోస్యం
- పరిస్థితులకు అనుగుణంగా ఆడగలనని నిరూపిస్తున్నాడని కితాబు
- తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని సూచన
- క్రికెట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని సూచన
నితీశ్‌కు ఇది టెస్టుల్లో తొలి సెంచరీ అన్నారు. సమీప భవిష్యత్తులో అతను మరిన్ని సెంచరీలు చేయబోతున్నాడన్నారు. భవిష్యత్తులో అతను మరెన్నో సెంచరీలు చేయాలని ఆకాంక్షించారు. మెల్‌బోర్న్‌లో అతను చేసిన సెంచరీ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలవాలన్నారు. నితీశ్ రెడ్డి పరిస్థితులకు అనుగుణంగా ఆడగలనని నిరూపించగలుగుతున్నాడని ప్రశంసించారు. అతని షాట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు.
తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలి
నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసించిన గవాస్కర్... ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేసి ఉంటారని, దానిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. భారత క్రికెట్ కారణంగా ఈ గుర్తింపు దక్కిందని, కాబట్టి ఈ ఆటను అతను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు. నితీశ్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే అద్భుతమైన కెరీర్ అతని సొంతమవుతుందన్నారు.