హత్యాయత్నం కేసు... తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్
ఈ ఘటనలో మొదట మోహన్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయింది. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు... గురువారం నాడు ఆయనపై 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.