'జై శ్రీరామ్' అని నినదించిన ప్రపంచ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్
- రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న మిస్టర్ బీస్ట్
- అభిమానుల కోరిక మేరకు 'జై శ్రీరామ్' అంటూ నినదించిన యూట్యూబర్
- నమస్కారం ఎలా పెట్టాలో మిస్టర్ బీస్ట్‌కు నేర్పించిన రణ్‌బీర్
ప్రపంచవ్యాప్తంగా 51.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్‌సన్) 'జై శ్రీరామ్' అని నినదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముంబైలో నిర్వహించిన 'రామాయణం' సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆయన, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో రణ్‌బీర్ కపూర్, మిస్టర్ బీస్ట్‌కు భారతీయ సంప్రదాయ పద్ధతిలో రెండు చేతులు జోడించి ఎలా నమస్కరించాలో నేర్పించారు. అనంతరం అక్కడున్న ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన 'జై శ్రీరామ్' అని పలకడంతో ఈవెంట్‌లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 'జైశ్రీరామ్' అని నినదించాలని అభిమానులు కోరుతున్నారంటూ రణ్‌బీర్ కపూర్, ఆయన చెవిలో చెప్పగా, మిస్టర్ బీస్ట్ నినదించారు. అంతేకాకుండా, ఆయన మీడియా ప్రతినిధులకు హిందీలో ధన్యవాదాలు తెలిపి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబేతో పాటు దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ వేదికపైనే, తమ సంస్థ నిర్మించబోయే 'ది యాంగ్రీ బర్డ్స్ మూవీ 3' కోసం మిస్టర్ బీస్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న 'రామాయణం: పార్ట్ 1' చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.