హిందువులంటే జగన్‌కు గిట్టదు.. అందుకే ఆ విధంగా ప్రచారం: సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి
- ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ విగ్రహం ఘటనపై దీపక్ రెడ్డి ఆగ్రహం
- హిందువులంటే జగన్‌కు పడదనేందుకే ఈ ఘటనే నిదర్శనమని వ్యాఖ్యలు
- శుభసూచకమైన పసుపు రంగు అంటే వైసీపీకి గిట్టదని విమర్శ
- గతంలో 300 ఆలయాలపై దాడులు జరిగాయన్న దీపక్ రెడ్డి
- వైసీపీ తీరు మార్చుకోకపోతే మనుగడ కష్టమని హెచ్చరిక
వైసీపీ అధినేత జగన్ కు హిందువులన్నా, హిందూ సంప్రదాయాలన్నా గిట్టదని, అందుకే ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ విగ్రహంపై పసుపు రంగు పడిందంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా ఉమామహేశ్వరపురంలో వైఎస్సార్ విగ్రహంపై పసుపు పడిందనే నెపంతో, ఒక టీడీపీ నాయకుడిని బెదిరించి, బలవంతంగా విగ్రహాన్ని నీటితో కడిగించి, దాన్ని వీడియో తీసి వైసీపీ నేతలు రాక్షసానందం పొందారని ఆయన మండిపడ్డారు.
“హిందువులు శుభకార్యాలకు ప్రతీకగా భావించే పసుపు రంగు అంటే వైసీపీ నాయకులకు ఎందుకంత కోపం? విగ్రహంపై పసుపు పడితే, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గానీ, దారికాచి ఒక వ్యక్తిని బెదిరించి ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణం. ఇది కేవలం ఒక టీడీపీ నాయకుడిపై జరిగిన దాడి కాదు, యావత్ హిందూ సమాజంపై జరిగిన దాడిగా పరిగణించాలి” అని దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల ఇలాంటి దౌర్జన్యపూరిత ప్రవర్తనను చూసే 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఘోరంగా ఓడించారని, అయినా వారిలో మార్పు రాలేదని విమర్శించారు. భవిష్యత్తులోనూ ఇదే వైఖరి కొనసాగిస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు.
వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే అనేక సంఘటనలు జరిగాయని దీపక్ రెడ్డి గుర్తుచేశారు. “శ్రీశైలం నుంచి రామతీర్ధం వరకు దాదాపు 300 దేవాలయాలపై దాడులు జరిగాయి. అంతర్వేది రథం దగ్ధం నుంచి రామతీర్ధంలో రాముడి విగ్రహ శిరస్సు ఖండన వరకు ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డారు. అయినా బాధ్యులైన ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. అప్పటి మంత్రి కొడాలి నాని సైతం విగ్రహాల ధ్వంసంపై బాధ్యతారహితంగా మాట్లాడారు” అని దుయ్యబట్టారు.
తిరుమల పవిత్రతను సైతం మంటగలిపారని దీపక్ రెడ్డి ఆరోపించారు. బస్సు టికెట్ల వెనుక అన్యమత ప్రచార వాక్యాలు, టీటీడీ వెబ్‌సైట్‌లో అశ్లీల చిత్రాలు, అధిక ధరలతో భక్తులను దేవుడికి దూరం చేసే కుట్ర చేశారని విమర్శించారు. పరకామణిలో జరిగిన దొంగతనాన్ని జగన్ చిన్నదిగా అభివర్ణించడం, వైవీ సుబ్బారెడ్డి భార్య ఆధ్వర్యంలో ‘జగన్మోహక రక్షక’ అంటూ అన్యమత ప్రార్థనలు చేయించడం వంటి ఘటనలు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని అన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.