ఈసీ ప్రకటనతో అపోహలకు తెరపడింది: సీఎం చంద్రబాబు
- ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలంటూ ప్రచారం
- ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన ఈసీ
- తమ మధ్య విభేదాలు లేవంటూ సంయుక్త ప్రకటన విడుదల
- సోషల్ మీడియాలో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు
- రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను గౌరవించాలని పిలుపు
- గెలుపోటములను హుందాగా స్వీకరించడమే నాయకత్వ లక్షణమని ఉద్ఘాటన
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో కమిషనర్ల మధ్య విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా ఈసీ ఇచ్చిన ఏకగ్రీవ ప్రకటనతో అన్ని అపోహలకు తెరపడిందని ఆయన పేర్కొన్నరు. మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసిందని ఎక్స్ వేదికగా శనివారం ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న వివాదం తాజాగా ఈసీ వివరణతో ముగిసిందని తెలిపారు.
స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, బలమైన ప్రజాస్వామ్యంలో గెలుపును, ఓటమిని సమానంగా, హుందాగా స్వీకరించడమే నిజమైన నాయకత్వ లక్షణమని హితవు పలికారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని, భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.
సంయుక్త ప్రకటనతో వివాదానికి ముగింపు
కాగా, గత కొద్ది రోజులుగా తమ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలకు భారత ఎన్నికల సంఘం పూర్తిస్థాయి కమిషన్ శనివారం తెరదించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోతో పాటు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కమిషన్ అంతర్గత పనితీరు, ఓటర్ల జాబితా సవరణ, సాంకేతిక వ్యవస్థలపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
వివాదానికి నేపథ్యం ఇదే..
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించిన పలు నిర్ణయాలపై కమిషనర్లు సంధు, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ సెప్టెంబర్ 23న ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ, మరింత పారదర్శకత అవసరమని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి కమిషన్ సంయుక్తంగా స్పందించి, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం 2025 జూన్ 24న జారీ చేసిన ఆదేశాలను ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారని ఈసీ తన ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత కార్యక్రమ షెడ్యూళ్లను కూడా ఏకాభిప్రాయంతోనే విడుదల చేశామని తెలిపింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని గుర్తుచేసింది. నిర్ణయాలన్నీ సమష్టిగా, సంస్థాగత విధివిధానాలను అనుసరించే తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది.