గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేం: తెలంగాణ హైకోర్టు

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేం: తెలంగాణ హైకోర్టు

TG HC judgment on Group 2 exams
  • గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్లు
  • ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమన్న హైకోర్టు
  • అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్న టీజీపీఎస్సీ
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. డిసెంబర్ 16న రైల్వే పరీక్ష ఉందని, ఒకేరోజు గ్రూప్ -2, రైల్వే పరీక్షలు ఉన్నందున వేరే తేదీకి మార్చాలని పిటిషనర్లు కోరారు.

విచారణ అనంతరం వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారని, కాబట్టి వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.
Advertisement
Telangana
TS High Court
TGPSC
Group 2

More Telugu News