ఓ ఇంటివాడు కాబోతున్న అఖిల్ అక్కినేని... జైనాబ్ తో నిశ్చితార్థం

Akhil Akkineni engagement with Jainab Ravdjee
  • అఖిల్, జైనాబ్ మధ్య రెండేళ్లుగా ప్రేమ
  • పెళ్లికి ఇరు కుటుంబాలు ఓకే
  • నాగార్జున నివాసంలో కొద్ది మంది సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇంట మరో శుభకార్యం జరగనుంది. ఇప్పటికే నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకోగా... తాజాగా, చిన్న కొడుకు అఖిల్ అక్కినేని కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అఖిల్... జైనాబ్ రవద్జీతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఈ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

అఖిల్ చేయందుకోబోతున్న జైనాబ్ ఓ ఆర్టిస్ట్. ఆమె తండ్రి పేరు జుల్ఫీ రవద్జీ. ఇక, అఖిల్ కు, జైనాబ్ కు రెండేళ్ల కిందట పరిచయం కాగా, అది ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

వీరి నిశ్చితార్థం నాగార్జున నివాసంలో అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది. అఖిల్-జైనాబ్ నిశ్చితార్థంపై నాగార్జున స్పందించారు. తన చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లిపీటలు ఎక్కుతుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

తన కుమారుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం చోటు చేసుకుంటుండడం పట్ల తండ్రిగా హర్షిస్తున్నానని తెలిపారు. జైనాబ్ తమ కుటుంబానికి మరింత వన్నె తెస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ శుభకార్యం కోసం ఇరు కుటుంబాలు అత్యంత ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాయని వివరించారు.
Advertisement
Akhil Akkineni
Jainab Ravdjee
Engagement
Nagarjuna
Tollywood

More Telugu News