చిన్నాన్న భౌతికకాయంతో నారావారిపల్లెకు చేరుకున్న నారా లోకేశ్
- హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి భౌతికకాయం తరలింపు
- కాసేపట్లో నారావారిపల్లెకు చేరుకోనున్న చంద్రబాబు
- మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు
చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకున్న తర్వాత రామ్మూర్తి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. చంద్రబాబు నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొననున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో పరిస్థితి పూర్తిగా విషమించి నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.