శంషాబాద్ లో షార్జా విమానానికి బాంబు బెదిరింపు
- ఫ్లైట్ ఎక్కి తన వద్ద బాంబ్ ఉందంటూ ఓ వ్యక్తి కేకలు
- సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేసిన సిబ్బంది
- గత కొన్నిరోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదట వారిని కిందకు దించారు. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. నిన్న నాగపూర్ విమానానికి కూడా ఓ బాంబు బెదిరింపు వచ్చింది. గత కొన్నిరోజులుగా పదులు, వందల సంఖ్యలో పేక్ బాంబు బెదిరింపులు వస్తున్నాయి.