డాక్టర్ చల్లా ప్రీతితో దర్శకుడు క్రిష్ పెళ్లి... ఫొటోలు ఇవిగో!
- క్రిష్ కు గతంలో విడాకులు
- తాజాగా రెండో పెళ్లి చేసుకున్న వైనం
- సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న ఫొటోలు
కాగా, క్రిష్ తో జీవితం పంచుకుంటున్న డాక్టర్ ప్రీతి చల్లా హైదరాబాదులో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. క్రిష్-ప్రీతిల వివాహ రిసెప్షన్ నవంబరు 16న జరగనున్నట్టు తెలుస్తోంది.
క్రిష్ కు గతంలో పెళ్లి కాగా, మొదటి భార్య డాక్టర్ రమ్యతో విడాకులయ్యాయి. అటు, డాక్టర్ ప్రీతి చల్లాకు కూడా ఇది రెండో పెళ్లేనని సమాచారం. ఆమె తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నట్టు కథనాలు వచ్చాయి.


