విశాఖ‌ప‌ట్నంలో తాజ్ గ్రూప్ హోటల్‌!
Add ap7am to your home Screen

విశాఖ‌ప‌ట్నంలో తాజ్ గ్రూప్ హోటల్‌!

Taj Hotel In Visakhapatnam
  • అనువైన స్థ‌లం కోసం ప‌రిశీలించిన సంస్థ ప్ర‌తినిధుల బృందం
  • విశాఖ‌, అన‌కాప‌ల్లి జిల్లాల్లో స్థ‌ల ప‌రిశీల‌న‌
  • తాజ్ ప్ర‌తినిధుల‌కు భూముల‌ను చూపించిన రెవెన్యూ, ప‌ర్యాట‌క శాఖ అధికారులు
ప్ర‌ముఖ హోటల్ చైన్ తాజ్ గ్రూప్ ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో భారీ హోటల్ నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ ప్ర‌తినిధుల బృందం రెండు రోజులుగా అనువైన స్థ‌లం కోసం ప‌రిశీలించింది. విశాఖ‌, అన‌కాప‌ల్లి జిల్లాల్లో తీరానికి ద‌గ్గ‌ర‌గా వంద ఎక‌రాలు కేటాయిస్తే హోట‌ల్ నిర్మించేందుకు వారు సంసిద్ధ‌త వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇందులో భాగంగా బుధ‌వారం విశాఖ‌లో కొన్ని స్థ‌లాల‌ను ప‌రిశీలించ‌గా, గురువారం అన‌కాప‌ల్లి జిల్లాలోని అచ్యుతాపురం ప‌రిస‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. అలాగే విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం స‌మీప ప్రాంతాల‌ను కూడా వారు ప‌రిశీలించారు. దీంతో రెవెన్యూ, ప‌ర్యాట‌క శాఖ అధికారులు తాజ్ ప్ర‌తినిధుల‌కు ఆయా భూముల‌ను చూపించ‌డం జ‌రిగింది. 
Advertisement
Taj Hotels
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News